VZM: ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస, వేపాడ, జామి మండలాల్లో జిల్లా ప్రత్యేకాధికారి రవి సుభాష్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్‌తో కలిసి తుఫాన్ ప్రభావిత మండలాల్లో పర్యటించారు. భీమసింగి జంక్షన్ వద్ద రహదారిపై నీరు నిల్వ ఉండటం గమనించిన అధికారులు, ఇరిగేషన్ శాఖకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.