BDK: పినపాక మండలం ఎల్చి రెడ్డి పల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మికతనికి చేశారు. విద్యార్థులకు అమలు చేస్తున్న భోజన మెనూ గురించి ఆరా తీశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలు, సౌకర్యాల గురించి స్వయంగా విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.