SKLM: సారవకోట మండలంలో వివిధ గ్రామాలలో సుమారు 2 వేల ఎకరాల మేరకు నీటిలో మునిగిపోయాయని వ్యవసాయ శాఖ అధికారి వెంకటరావు తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ.. రైతులకు తగు సూచనలు సలహాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కోదడ్డపనస పంచాయితీ కొత్తూరులో చాలావరకు వరి పంట నీటిలో మునిగిపోయాయని అన్నారు. దీనిపై తగు సూచనలు రైతులకు అందజేస్తామని వివరించారు.