CTR: కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలోని శ్రీప్రసన్న ముత్తు మారెమ్మ గుడి పూజారి కరుణ శేఖర్ కన్నుమూశారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మృతిచెందారు. ఎన్నో ఏళ్లుగా మారెమ్మ ఆలయ పూజారిగా కుప్పం ప్రాంత భక్తులకు ఆయన సుపరిచితులు. కరుణ శేఖర్ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.