AP: బాపట్ల జిల్లా అద్దంకి దగ్గర వరదల్లో ఆరుగురు గల్లంతు అయ్యారు. గుండ్లకమ్మ వరదలో ముగ్గురు ఉద్యోగులు చిక్కుకోగా వారిని కాపాడేందుకు మరో ముగ్గురు పడవలో వెళ్లారు. అందరూ కలిసి తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటంతో ఆరుగురు గల్లంతు అయ్యారు. అయితే ఆరుగురిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది మరో బోటును రప్పిస్తున్నారు.