SKLM: టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన 5నెలల చిన్నారి పొత్తంగి భేక్షిత్, ఓపెన్ హార్ట్ సర్జరీకి టెక్కలి అభయం యువజన సేవా సంఘం చొరవతో దాతలు ముందుకు వచ్చారని చిన్నారి తండ్రి ఆనందరావు తెలిపారు. బుధవారం రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారని అన్నారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి పట్ల ఉదారతతో దాతల ముందుకు రావడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.