NLG: భారీ వర్షాల కారణంగా నార్కట్పల్లి మండలం అక్కేనేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు భారీ వర్షాన్ని లెక్క చేయకుండా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యం రాశులను చూసి, రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.