W.G: మొంథా తుఫాను ప్రభావంతో ఆకివీడు మండల పరిధిలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ప్రజా జీవనానికి అంతరాయం కలగకుండా అధికారులు తక్షణమే స్పందించారు. జాతీయ రహదారిపై విరిగిపడిన చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. ఆకివీడు శివారు అజ్జమూరు ప్రాంతంలో సీఐ వీ. జగదీశ్వరరావు, పోలీసు సిబ్బంది చెట్లను నరికి, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.