MBNR: జాగృతి జనం బాట ద్వారా జనాల్లోకి వెళతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించినట్టు వెల్లడించారు.