GNTR: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని సమస్యలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయ కేంద్రానికి అందిన ఫిర్యాదులను పరిశీలించి, విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని, అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, వాగులు ఉద్ధృతంగా ఉంటే రాకపోకలను నియంత్రించాలని సూచించారు.