అనంతపురంలో గత ఐదేళ్లలో జరగని పనులను 16 నెలల్లో చేసి చూపించామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఎంపీ అంబికాతో కలిసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలపై చర్చించారు. 30 ఏళ్లుగా సమస్యగా ఉన్న డంపింగ్ యార్డును డిసెంబర్ చివరి నాటికి చెత్త లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.