RR: అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్ పేటలో ఏఈ ప్రభులాల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరెంట్ కనెక్షన్, మీటర్ రీప్లేస్ మెంట్, బిల్లింగ్ సమస్యలు పరిష్కరించడానికి ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఈని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.