సత్యసాయి: పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా జయంతి వేడుకలకు వచ్చే భక్తుల కోసం సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వసతి సౌకర్యాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఎనుములపల్లి విద్యుత్ సబ్స్టేషన్ పక్కన నిర్మిస్తున్న వసతి కేంద్రంలో అధునాతన ఫ్యాన్లు ఏర్పాటు చేసి, భోజనం, ఇతర సౌకర్యాలను కూడా కల్పించనున్నారు.