MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామంలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (KLI)కాల్వ భారీ వర్షాలకు తెగిపోయింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్వో రాజు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తుఫాను కారణంగా భారీగా వరద నీరు చేరి తెగిపోయినట్లు గుర్తించారు. యుద్ధ ప్రాతిపదికన కాల్వకు మరమ్మత్తులు పూర్తి చేస్తామన్నారు.