AKP: గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరహానది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ నది మండలంలో అన్నవరం, ఎండపల్లి, కోటవురట్ల, కైలాస పట్నం, గొట్టివాడ, పందూరు గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ తిరుమల బాబు హెచ్చరించారు. ప్రజలు నదిలోకి దిగవద్దని హెచ్చరించారు.