సత్యసాయి: ధర్మవరంలోని రుషి విద్యాలయ విద్యార్థులు జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప్ సింగ్ తెలిపారు. ఖోఖో ఆటల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని, చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యానికి మేలని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఎంపికైన విద్యార్థులను అభినందించి, భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు తెలియజేసింది.