KDP: విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ను మంగళవారం కలిసిన ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి, వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఆసుపత్రికి తగిన నిధులు మంజూరు చేసి, నిర్మాణ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు.