PDPL: ఎగువన కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 148.00 మీటర్లుగా, నీటి నిల్వ 20.1754 టీఎంసీలుగా నమోదైంది. మొత్తం ఇన్ఫ్లో 73,089 క్యూసెక్కులు కాగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ఇందులో శ్రీరాం సాగర్ నుంచి 50,000, కడెం నుంచి 4,744 క్యూసెక్కుల ప్రవాహం ప్రవేశిస్తోంది. ప్రాజెక్ట్ 62 గేట్లలో 9 గేట్లు తెరిచినట్లు అధికారులు తెలిపారు.