JGL: ఇబ్రహింపట్నం పశు వైద్యాధికారి డాక్టర్ శైలజ, పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఇబ్రహింపట్నం మండలంలోని గ్రామాల్లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13 వరకు పశువణులకు టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి టీకాలు వేయించుకోవడం ద్వారా గాలికుంటు వ్యాధి వల్ల కలిగే నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు.