HYD: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. లక్డీకాపూల్లోని మెహిదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు నిలవడంతో వాటిని తొలగించాలని అధికారులకు ఆదేశించారు. భారీ వర్షాలు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.