GNTR: తుఫాన్ అనంతరం ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వరద పరిస్థితులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నాయని తెలుసుకున్నారు. యూరియా సరఫరా, పంటల రక్షణ చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. రహదారుల పూడికలు తొలగించి రాకపోకలు సులభం చేయాలని ఆదేశించారు.