SRPT: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. మద్దిరాల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ (45) ద్విచక్ర వాహనంపై మెడికల్ షాప్ వెళ్తుండగా కొత్త బడి దగ్గర చెట్లు కూలి వ్యక్తి మృతి చెందాడు. తానంచేర్ల నుంచి మద్దిరాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.