JN: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, వర్షాన్ని లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బోరబండ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రజలను కలిసి, చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి, సంక్షేమం అందించగల నాయకుడు నవీన్ యాదవ్ మాత్రమే అన్నారు.