BDK: భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని ఆదివాసి కొండ రెడ్ల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఇవాళ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. గత 20 సంవత్సరాల నుంచి కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు.