KDP: తుఫాను సహాయక చర్యల కోసం బద్వేల్ పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బందితో ఇవాళ మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సమావేశం నిర్వహించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎటువంటి ఆటంకాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.