KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మూడు మొబైల్ ఫోన్లను ఏఎస్సై సంపత్ రెడ్డి మంగళవారం బాధితులకు అందజేశారు. కేశవపట్నం, అంబాలాపూర్, కొత్తగట్టు గ్రామాలకు చెందిన బుర్ర రవి, తోట అరవింద్, చెంచాల శ్రీనివాసులు బాధితులుగా ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తించినట్లు తెలిపారు.