ADB: ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి గణేష్ బుధవారం కోరారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు మేధావులు బంద్‌కు సహకరించాలని కోరారు.