SRD: జిల్లాలోని 44 పీఎం శ్రీ పాఠశాలకు వచ్చిన నిధులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రావిణ్య సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న సివిల్ వర్క్‌లను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.