సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో శతజయంతి ఉత్సవాల ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించారు. పర్యాటక శాఖ ద్వారా మంజూరైన రూ. 10 కోట్ల నిధులతో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను నవంబర్ 10లోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, సుందరీకరణ పనులపై తగు సూచనలు జారీ చేశారు.