WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని లక్కీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురుపై మంగళారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్కీ డ్రా స్కీం పేరుతో అనిల్ రామనాథం కర్ణాకర్ ప్రజలను నమ్మించి మోసం చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.