MBNR: జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి(డిఈఓ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని తక్షణమే సంబంధిత పాఠశాలలకు తెలియజేసి, విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని డీఈవో కోరారు.