AP: రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీని పొడిగించింది. ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అధికారులు అవకాశం కల్పించారు. రూ.1,000 ఫైన్‌తో వచ్చే నెల 6 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి 23 నుంచి ఫస్టియర్, ఫిబ్రవరి 24 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.