తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. చెన్నై పోయిస్ గార్డెన్లోని రజినీ, ధనుష్ ఇళ్లకు, కీల్పాక్కంలో ఉన్న TNCC అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇళ్లకు పేల్చేస్తామంటూ చెన్నై డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలంలో తనిఖీలు చేస్తున్నారు.