WGL: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం వర్దన్నపేట పట్టణం పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఫుస్కోస్ స్కూల్ 8వ తరగతి విద్యార్థులు పాల్గొని పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు, సాంకేతిక పరికరాలు, కేసు ప్రాసెస్ విధానం గురించి అవగాహన పొందారు. పోలీసులు ఉపయోగించే పరికరాలు, ఆయుధాలు విద్యార్థులకు ఎస్సై సాయిబాబు వివరించారు.