SRD: జిన్నారం సీఐగా రమణారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సిఐగా పని చేస్తున్న నజీముద్దీన్ ఐజి కార్యానికి బదిలీపై వెళ్లారు. నూతన సీఐ రమణారెడ్డిని పోలీస్ స్టేషన్ సిబ్బంది సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరు తనకు సహకరించాలని కోరారు.