AP: ‘మొంథా’ తుపాను ప్రభావం పిఠాపురంపై తీవ్రంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట తదితర తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు గ్రామానికి ఒకరు చొప్పున ప్రత్యేక అధికారిని నియమించారు. 34మంది సభ్యులతో ఒక NDRF బృందం పిఠాపురంలో అప్రమత్తంగా ఉంది.