W.G: తణుకు పట్టణ పరిధిలోని మంగళవారం వీచిన ఈదురు గాలులకు స్థానిక ఇరగవరం కాలనీలోని ఒక ఇంటిపై వృక్షం కూలిపోయింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొంథా తుఫాను ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున ఈదురు గాలులతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ ప్రభావంతో తణుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది.