SKLM: బహుదా నదిలో నీటి ప్రవాహం 44500 క్యూసెక్కుల చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జలవనరుల శాఖ ఎస్ఈ పొన్నాడ సుధాకర్ మంగళవారం తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా బగలటి డ్యాం గేట్లు ఎత్తి వేయడంతో వరద వచ్చినట్లు వివరించారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.