VZM: మోంథా తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి బోగాపురంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మంగళవారం సందర్శించారు. గ్రామాల వారీగా అందుతున్న సమాచారాన్ని పరిశీలించి, విద్యుత్, రవాణా, రహదారి, వైద్య, సహాయక చర్యలపై అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం అవసరమైన ప్రాంతాలను గుర్తించారు.