కోనసీమ: పీ.గన్నవరం మండలం వాడ్రేవుపల్లిలో మంగళవారం పాడైపోయిన ఒక పెంకుటింట్లో వృద్ధుడు ఉండిపోవడంతో స్థానికులు గమనించి నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని ఆ ఇంట్లో నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తుఫాన్ నేపధ్యంలో పురాతన ఇళ్లల్లో ఉండవద్దని అధికారులు సూచించారు. పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు.