AP: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాలపై ఉండనుంది. ఈ నేపథ్యంలో, ముంపు ప్రాంతాల్లోని ప్రజల కోసం ప్రభుత్వం 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాదాపు 76,000 మందిని ఈ పునరావాస కేంద్రాల్లోకి తరలించింది. అలాగే, 488 కంట్రోల్ రూమ్లు, 219కి పైగా మెడికల్ క్యాంపులు, 1147 JCBలు, ప్రోక్లెయిన్లు, క్రేన్లతోపాటు 321 డ్రోన్లను కూడా సిద్ధం చేసింది.