JN: తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో కోతుల బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ఇళ్లలోకి చొరబడి వస్తువులు దోచుకోవడంతో పాటు పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. పంటలను నాశనం చేయడంతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. పలుమార్లు విజ్ఞప్తులు చేసినా అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలన్నారు.