AP: ‘మొంథా’ తుఫాన్ తీరం దాటింది. నరసాపూర్ సమీపంలో ఈ తుఫాన్ తీరాన్ని దాటింది. అల్లకల్లోలంగా సముద్రం, తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సహాయక బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.