AP: ‘మొంథా’ తుఫాన్ కారణంగా కోస్తాంధ్రలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. రాబోయే 8 నుంచి 10 గంటలు భారీ వర్షాలు, గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 10 సెం.మీ. నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.