TPT: కార్తీక మాసంలోని పర్వదినాల్లో ముల్లోకాల్లో ఉన్న పుణ్య తీర్థాలు కపిలతీర్థం పుష్కరిణికి చేరుతాయని ప్రతీతి. కార్తీక పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, సోమవారం, శనివారాల్లో మధ్యాహ్న సమయంలో వివిధ పుణ్యతీర్థాలు కలుస్తాయని అర్చకులు తెలిపారు. ఈ సమయంలో స్నానాలు చేయడం వల్ల సమస్త పాపవిముక్తి జరుగుతుందని భక్తుల విశ్వాసం.