కృష్ణా: మచిలీపట్నం నగరంలోని సర్కార్ తోట ప్రాంతంలో ‘మొంథా’ తుపాను ప్రభావంతో తీవ్రమైన ఈదురు గాలులు వీచాయి. ఈ గాలుల తీవ్రతకు చెట్లు విరిగి కరెంట్ ట్రాన్స్ఫార్మర్పై పడటంతో, నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని, మరమ్మతు పనులను ప్రారంభించారు.