RR: హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో మంచిరేవుల రోడ్డు నుంచి ఓఎం కన్వెన్షన్ ప్రాంతంలో బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.