NZB: లింబాద్రిగుట్టపై భీంగల్ పట్టణ ప్రజలకు నవంబర్ 4న ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు బుధవారం తెలిపారు. శ్రీ లక్ష్మినృసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా భీంగల్ గ్రామం అడ్రస్ ఉన్న ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు.