కోనసీమ: అమలాపురంలో కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను అనే వ్యక్తి మిస్సింగ్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని శ్రీను భార్య అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంతవరకు శ్రీను ఆచూకీ దొరకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. తన భర్తను ఎవరో ఏదో చేశారని శ్రీను భార్య అనుమానం వ్యక్తం చేశారు.