SRD: జిల్లాలో చెరుకుకోతకు కూలీల కొరత తీరనున్నది. ఈ మేరకు జిల్లాలో 35 చెరుకు కోత యంత్రాలు రంగంలోకి దిగనున్నాయి. ఒక్కో యంత్రం రోజుకు 70 నుంచి 100 టన్నుల చెరుకు కోసే సామర్థ్యం ఉంది. ఈ మేరకు బ్యాంకర్లు 5 యంత్రాలు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జిల్లాలో మూడు చెరుకు ఫ్యాక్టరీల పరిధిలో 21 లక్షల టన్నుల చెరుకు పంట ఉత్పత్తి కానుందని అంచనా.